calender_icon.png 13 September, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవం

13-09-2025 02:44:08 AM

తూప్రాన్ /మనోహరాబాద్, సెప్టెంబర్ 12 :తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో ఈద్ మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పండుగ సందర్భంగా మనోహరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. మసీదు నుండి రోడ్డు వరకు పెద్ద ఎత్తున ముస్లిం సహోదరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

తూప్రాన్లో తిలావత్ అనే వ్యక్తి అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ అధ్యక్షులు ఎండి జావేద్ పాషా, కమిటీ అధ్యక్షు లు అజీజ్ ఖాన్, కమిటీ సభ్యులు సమద్ న యీమ్, రజాక్, రఫీక్, షర్ఫుద్దీన్, మహమ్మద్ బేగ్, సంయుద్దీన్ గౌస్, ఫహీం ఉస్మా న్, గులాం జిలాని, మోయిజ్ అప్సర్, ఇర్షా ద్, అజ్జు, లాయక్ తదితరులు పాల్గొన్నారు.