24-10-2025 12:00:00 AM
హుస్నాబాద్, అక్టోబర్ 23 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గురువారం క్లస్టర్ ఆఫ్ బ్లాకు లెవెల్ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, స్పోరట్స్ ఆఫ్ ఇండియా, మేరా భారత్, వాజపేయి యూత్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ప్రారంభించారు. బాలికల విభాగంలో జరిగిన కబడ్డీ పోటీల్లో భారత్ పబ్లిక్ స్కూల్, మైనారిటీ స్కూల్ టీంలు ఫైనల్కు చేరుకున్నాయి.
వాలీబాల్ పోటీల్లో మోడల్ స్కూల్ కు చెందిన రెండు టీంలు ఫైనల్కు అర్హత సాధించాయి. వందమీటర్ల రన్నింగ్ పోటీలో రిస్వంత్ మొదటి స్థానంలో, సిద్ధార్థ్ రెండవ స్థానంలో, హుస్సేన్ మూడవ స్థానంలో నిలిచారు. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ విభాగాల ఫైనల్ మ్యాచ్లు శుక్రవారంన మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్టు వాజపేయి యూత్ అసోసియేషన్ సభ్యుడు బత్తుల శంకర్ బాబు తెలిపారు.
క్రీడల ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేల్పుల నాగార్జున్, పోలోజు రాజేందర్, వరయోగుల అనంతస్వామి, బానోతు అనిల్, కుమారస్వామి, రైనా, పీఈటీలు, అంపైర్లు జాల శ్రీనివాస్, ఠాకూర్ దీలిప్, మహేశ్, మెస్సీ పాల్గొన్నారు.