calender_icon.png 24 October, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసే సహాయంతో తరతరాలు బాగుపడతాయి

24-10-2025 12:00:00 AM

- విద్యా నిధికి టీజీవో సహాయం చిరస్మరణీయం 

- కలెక్టర్కు రూ 7 లక్షల 60 వేల చెక్కు అందించిన టీజీవో నేతలు

- ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్, అక్టోబర్ 23(విజయక్రాంతి): చేసే సహాయంతో తరతరాలు బాగుపడే దిశగా విద్యార్థి నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహబూబ్ నగర్ శాఖ తరపున విద్యా నిధికి రూ.7లక్షల60వేల చెక్కును కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి ఆ సంఘం అధ్యక్షులు ఎస్ విజయకుమార్ సమక్షంలో టీజీవో నేతలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా నిధికి దాతలు ముందుకు రావాలని చదువు దూరంగా ఉన్న విద్యార్థులకు విద్యార్థి నిధులను ఖర్చ చేసి వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. టీజీ వనేతలు ఐక్యంగా ఉంటూ విద్యానిధికి తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.