24-10-2025 12:00:00 AM
ముషీరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యువత రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ లో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపెడుతున్నారన్నారు.
రాజకీయ నాయకులుగా మం చి నాయకత్వం గల నాయకులుగా తయారు చేయడం జరుగుతుందన్నారు. అత్యధికంగా యువత కలిగిన మన రాష్ట్రంలో చాలామంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా, సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారన్నారు. లోకల్ యువతకు చైతన్య వంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చన్నారు. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో యువతకు అవకాశం ఇవ్వాలన్నారు.
ఈ మార్పు పల్లెల్లో నుంచి పట్టణం వరకు చేరాలని, గల్లి నుండి ఢిల్లీ వరకు చేరాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయ కులు రిటైర్డ్ ఐఐఎస్ కూనప రెడ్డి హరిప్రసాద్, ఆఫీసర్ ప్రముఖ డాక్టర్ సింగం శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి శ్యామ్ రావ్, రాష్ట్ర మహిళా నాయకులు విజయ రెడ్డి, ఉదయకుమారి, మైనార్టీ సెల్ నాయకుడు ప్రొఫెసర్ జలా లొద్దీన్ పాల్గొన్నారు.