31-10-2025 11:27:36 PM
చేగుంట: చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ గ్రామంలొ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎం ప్రధానోపాధ్యాయులు ఉప్పరి రవీందర్ పదవి విరమణ సభ స్థానిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరి రవీందర్ సుజాత,దంపతులు ను కుటుంబ సభ్యులు , తోటి ఉపాధ్యాయ , ఉపాధ్యాయురాలు శాలువా కప్పి పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప్పరి రవీందర్ మాట్లాడుతూ ఉద్యోగి అన్నప్పుడు పదవి విరమణ తప్పదని అన్నారు.
తన 30 సంవత్సరాల పదవి సమయములో చిన్న తప్పు జరగకుండా పై స్థాయి అధికారుల మన్నలను పొందడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఇన్ని సంవత్సరాలు పై స్థాయి అధికారుల క్రింది స్థాయి అధికారుల సహకారంతో ఉపాధ్యాయునిగా కొనసాగినందుకు గర్విస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమర్ శేఖర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, విట్టల్ రెడ్డి, నర్సింలు, బాల పోచయ్య, ఊర్మిళ,శివకుమార్,సిద్దిరాములు, చల్ల రామకృష్ణ, పూర్వ విద్యార్థులు, యాదగిరి, నిరుడు ప్రవీణ్, నేడు అశోక్, బిట్లా మహేష్, దండు మహేష్, తాలూకా నాగరాజు, సాయిబాబా ఎల్లం,విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.