10-10-2025 12:00:00 AM
ఎల్బీనగర్, అక్టోబర్ 9 : హయత్ నగర్ ఇప్పుడు హైదరాబాద్ మహా నగరంలో కలిసినా... ఇప్పటి ఇంకా గ్రామీణ వాతావరణం చూడొచ్చు. ఒకప్పుడు హయత్‌నగర్ మండలం ఒక వెలుగు వెలిగింది. హయత్ నగర్ గ్రామంలో అనేక ప్రముఖులు వివిధ రంగా ల్లో ఉన్నత రాణించి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా పట్టణీకరణ చెందినా తమ పూర్వీకుల ఆచారాలను హయత్ నగర్ వాసులు కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే వందేళ్ల క్రితం ప్రతిష్ఠించిన బొడ్రాయి ఇప్పుడు కనిపించి పరిస్థితి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధుల సమక్షంలో బొడ్రాయిని పునఃప్రతి ష్ఠాపన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హయత్‌నగర్‌లో దాదాపు వం దేండ్ల తర్వాత బొడ్రాయి ఉత్సవాలు జరుగబోతున్నాయి. గురువారం నుంచి ఆదివా రం వరకు బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు జరుగుతాయి.
ముస్తాబైన హయత్ నగర్ గ్రామం..
బొడ్రాయి ప్రతిష్ఠాపన నేపథ్యంలో హయత్ నగర్ గ్రామం స్వాగత తోరణాలు, విద్యుత్ లైటింగ్, ఇతర ఏర్పాట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వందేళ్ల తర్వాత జరుగుతున్న ఉత్సవాలకు ప్రజలందరూ ఉత్సాహంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని వీధులన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. హయత్ నగర్‌లో ఉన్న అన్ని దేవాలయాలు, గ్రామ దేవత ఆలయాలను మామిడి తోరణాలతో అలంకరించా రు.
నాలుగు రోజులపాటు హయత్ నగర్ బొడ్రాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు జనమంది శేఖర్ శర్మ, బైండ్ల పూజారులు ఏదుల్లా గౌరీ శంకర్ పర్యవేక్షణలో పూజా క్రతువులు అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా, శైవ, శాక్తేయ, సంప్రదాయ ఆగమానుసారం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం ఐదు గంటల వరకు గ్రామ పొలిమేరలో రాకపోకలను నిషేధించారు.
ఆది వారం మధ్యాహ్నం నుంచి బోనాల పండు గ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు గురువారం బొడ్రాయి ఊరేగింపు, శుక్రవారం రోజు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలలో సంప్రోక్షణ, అలంకరణ, దూప దీప, నైవేద్యాలు, శాంతి పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుందని ఉత్సవ కమిటీ తెలిపింది. 11న శనివారం హోమాలు, 12న ఆదివారం చివరి రోజు యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపనతో ఉత్సవాలు ముగుస్తాయని హయత్ నగర్ బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.