10-10-2025 12:00:00 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ లోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో ‘భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య‘ జన్మదినం పురస్కరించుకొని ‘ఇంజినీర్స్ డే‘ ని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘మాజీ చీఫ్ ఇంజనీర్ (భారతీయ రైల్వే) శ్రీసాయిబాబా ఆంకాళ ‘ పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో యాంత్రిక విద్యార్థుల పాత్ర మరియు ఇంజనీర్స్ యొక్క అవశ్యకతను వివరించారు. ఈకార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘బిల్డథాన్ 2025‘ మోడల్ ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ మోడల్ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుమారు 40కి పైగా మోడల్స్ ని ప్రదర్శించారు. కార్యక్రమ కమిటీ మరియు అతిథులు మోడల్ ప్రదర్శనను సందర్శించి విజేతలకు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈకార్యక్రమంలో ఐజిఎస్, ఐసిఐ విద్యార్థులు చాప్టర్లను సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈకార్యక్రమంలో డీన్లు ప్రొఫెసర్ ముత్తారెడ్డి, ప్రొఫెసర్ విజయకుమార్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, ప్రొఫెసర్ నారాయణరెడ్డి, సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ పల్లవి బద్రి, ఇతర విభాగ అధిపతులు, కార్యక్రమ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనారు.