25-11-2025 10:11:57 PM
వరంగల్/హనుమకొండ (విజయక్రాంతి): రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వరంగల్లోని ఆంధ్ర బాలిక పాఠశాలలో చదువుతున్న ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి పిల్లలకు ట్రస్ట్ చే అవగాహన సదస్సు వాణి ప్రియదర్శిని అధ్యక్షులు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ కూరాకుల భారతి పాల్గొన్నారు. అనంతరం భారతి మాట్లాడుతూ నేటి చిన్నపిల్లలే రేపటి మహిళలని, మహిళ శారీరకంగా మానసికంగా విజ్ఞాన పరంగా అభివృద్ధి చెంది, కుటుంబానికి ధైర్యంగా నిలవాలని అన్నారు.
మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్. ఏ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పిల్లలను ఎవరైనా హింసించినట్లయితే చట్టబద్ధతగా 181 నెంబర్ కు తెలియజేసి రక్షణ పొందవచ్చు అన్నారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధమైన ఘర్షణకు దారితీసిన కూడా సామరస్యంగా వారిని సానుకూల పరిచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మీరు ఇతరులకు మార్గదర్శకులు కావాలని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాణి ప్రియదర్శిని మాట్లాడుతూ ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం అని, ఆర్థిక స్వాంతన ఉంటే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారన్నారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అంటే వాళ్ళు బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శారద, సునీత, నీలిమ ,నిర్మల ,శ్యామల, రాజమణి ,రాజ్యలక్ష్మి మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.