25-11-2025 10:01:05 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ గ్రామంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ప్రభుత్వం చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూర్ గ్రామంలోని మహిళల అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... ఏఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయం. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన మహిళల నుండి 60 సంవత్సరాలపై వృద్ధులకు మరియు డ్వాక్రా మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సంగయ్య, ఉపాధ్యక్షులు సోపి, సీసీ నజీర్, వివోఏ సురేందర్, వివో సంఘం అధ్యక్షురాలు లింగవ్వ తదితరులు పాల్గొన్నారు.