calender_icon.png 21 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం

20-09-2025 11:53:19 PM

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామ శివారులో చిట్యాలపల్లికి వెల్లే ఎస్సారెస్పీ కాలువ వంతెన వద్ద రేవెల్లి నుండి  ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువస్తున్న తులసినగర్ జగిత్యాల పట్టణానికి చెందిన ఆవారి అమరేందర్ (55) మృతదేహాన్ని స్థానికులు గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న చొప్పదండి పోలీసులు మృతుని జేబులు తనిఖీ చెయ్యగా అందులో పర్స్, ఫోన్ ద్వార అతని ఆచూకి తెలుసుకొనగా జగిత్యాల వాసిగా గుర్తుంచి వారి కుటుంబసభ్యులకి సమాచారం ఇవ్వగా, మృతుడు నిన్న మధ్యాహ్నం ఇంట్లో నుండి వెళ్లిపోగా ఈరోజు ఉదయం జగిత్యాల పట్టణ పీఎస్ లో పిర్యాదు చేశామని చెప్పగా. మృతదేహాన్ని బయటకి తీసి పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పంపించి వారి కుటుంబ సబ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చొప్పదండి పోలీసులు తేలిపారు.మృతుడు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్అని తేలిపారు