26-07-2025 12:45:02 AM
మహబూబాబాద్, జూలై 25 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం సమీపంలో వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఆగేపోయిన నరేష్ మృతదేహం శుక్రవారం లభించింది. 48 గంటల పాటు నరేష్ ఆచూకీ కోసం అధికార యంత్రాంగం ఎంతో శ్రమించింది.
వాగులో గల్లంతైన నరేష్ మృతదేహం కొద్ది దూరంలో శుక్రవారం గుర్తించారు. అక్కడినుండి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. వాగులో గల్లంతైన నరేష్ ఆచూకీ కోసం ఎస్త్స్ర రవికుమార్, తహసిల్దార్ రాజు, ఎంపీడీవో రోజా రాణి తో పాటు వివిధ శాఖల అధికారులు స్పందించిన తీరు పట్ల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.