11-07-2025 07:09:36 PM
ఘనంగా బండి సంజయ్ బర్త్ డే వేడుకలు
చిగురుమామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షుడు పోలోజు సంతోష్ పాల్గొని మాట్లాడుతూ... దాదాపు 20 మంది యువకులు రక్త దానం చేశారని తెలిపారు. తరువాత కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.