calender_icon.png 25 August, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయిని కొమురయ్య ఇకలేరు

22-03-2025 12:32:06 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్యమం(Mali Dasha Telangana Movement)లో బెల్లంపల్లి ప్రాంతం నుంచి తనదైన పాత్ర పోషించిన నాయకులు బోయిన కొమురయ్య శనివారం తెల్లవారుజామున అనారోగ్య కారణాలతో మంచిర్యాలలో మరణించారు. అనేక విద్యార్థి ఉద్యపాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో కెసిఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీలో నాయకునిగా ఉండి ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని(Telangana movement) పరిగెత్తించారు. బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేసిన బోయిన కొమరయ్య మృతి వార్త బెల్లంపల్లిలో అతని సన్నిహితులను, అతనితో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులను నివ్వర పరిచింది.