calender_icon.png 25 August, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్న గౌడ్ స్ఫూర్తిని చాటిచెప్పిందే బీఆర్‌ఎస్

25-08-2025 12:00:00 AM

విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్

సిద్దిపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సర్వాయి పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కొమరం భీమ్ వంటి గొప్ప పోరాటయోధుల చరిత్ర మరుగునపడిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గోనెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోకలిసి హరీష్ రావు ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు, జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని చెప్పారు. “లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న గౌడ్ చరిత్రపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం, విక్టోరియా మ్యూజియంలో ఆయన రాతి విగ్రహాన్ని నెలకొల్పడం గొప్ప విషయంగా కొనియాడారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి, గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాటిచెట్టు ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఎక్స్-గ్రేషియాగా రూ.5 లక్షలు ఇచ్చిందని, గీత కార్మికుల పింఛను వయసును 50 సంవత్సరాలకు తగ్గించిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి గీత కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు.