calender_icon.png 25 August, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెరీర్‌లో ది బెస్ట్ అనిపించేలా నేను రెడీ

25-08-2025 12:46:00 AM

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో హవీష్. పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు నక్కిన త్రినాథరావు. వీరిద్దరి కాంబో లో రూపొందుతున్న కొత్త చిత్రం ‘నేను రెడీ’. ఈ చిత్రా న్ని హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి కథానాయిక కావ్య థాపర్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

కావ్య థాపర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుందని టీమ్ పేర్కొం ది. కావ్య కూడా ఈ సినిమా తన కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందం టోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొం టోంది. శ్రీలక్ష్మి, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపలక్ష్మి, జయవాణి, మాణిక్‌రెడ్డి, బలగం, సత్యనారాయణ, రోహన్ రాయ్ వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; డీవోపీ: నిజార్ షఫీ; ఫైట్స్: రామకృష్ణ; ఎడిటర్: ప్రవీణ్ పూడి; స్టోరీ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్; నిర్మాత: నిఖిల కోనేరు; రచన: దర్శకత్వం: నక్కిన త్రినాథరావు.