22-07-2025 05:09:53 PM
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పునర్ నిర్మాణం జరుగుతుంది..
ఏఐసీసీ సభ్యులు జిల్లా ఎన్నికల పరిశీలకులు సంపత్ కుమార్, ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని ఏఐసీసీ సభ్యులు జిల్లా ఎన్నికల పరిశీలకులు సంపత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samel) అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షులు కర్గే, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు నూతన కమిటీ, మండల కమిటీల పేర్లను, రానున్న స్థానిక ఎన్నికల పోటీ చేయు వారి పేర్లను కూడా, పనిచేసే వారిని గుర్తించి, ఎన్నికల బరిలో నిలబెడతామని అన్నారు.
గడచిన పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను నాయకులను కాంగ్రెస్ పార్టీ ఏనాడు మరిచిపోదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు తెలియపవలసిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికలు వచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ రైతు భరోసా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సన్న బియ్యం పంపిణీ ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు తుంగతుర్తి మండల కేంద్రంలో 45 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గతంలో జిల్లా పదవులకు పేర్లు ఇచ్చిన వారే కాకుండా నేడు కూడా కొత్తవారు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా మండల అధ్యక్ష పదవులు పీసీసీ నిబంధనలు, ఎమ్మెల్యే చే మమేకమై పేర్లను ప్రకటించనున్నట్లు తెలిపారు. తిరుమలగిరి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయడం కృషి చేసిన నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ కమిషన్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ,జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజి నరేష్, తోడుసు లింగ యాదవ్, దొంగరి గోవర్ధన్ అవిల మళ్లీ యాదవ్ నాగం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.