22-07-2025 05:14:40 PM
నూతనకల్ (విజయక్రాంతి): నూతనకల్ మాజీ ఎంపీపీ గోరుగంటి మోహన్ రావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్(Former MLA Gadari Kishore Kumar) పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మృతి చెందిన మృతులు గుండు లింగయ్య, ఎడవెల్లి బీఆర్ఎస్ నాయకురాలు బొడ్డు భద్రమ్మ, పిట్టల సూర్యకుమార్, మాజీ సర్పంచ్ గాజుల వెంకటయ్య, కొరివి వీరయ్య, కనకటి లక్ష్మయ్యల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, మాజీ సర్పంచ్ చూడు లింగారెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్ గౌడ్, తుంగతుర్తి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల తిరుమలరావు, మందడి సోమిరెడ్డి, బిక్కి బుచ్చయ్య గౌడ్, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, రేసు వెంకటేశ్వర్లు, మహేశ్వరం మల్లికార్జున్, ఉప్పుల వీరు యాదవ్, కనకటి మహేష్, వీరమల్ల యాదగిరి, నరేష్ తదితరులను ఉన్నారు.