12-07-2025 01:07:11 AM
నిజామాబాద్ జులై 12:(జయ క్రాంతి) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ ప్రతిబింబంగా బోనాల పండుగ జరుపుకుంటామని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వ హించే ఈ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఎంతో శుభసూ చకమని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వినాయక్ నగర్ లోని లక్ష్మి అమ్మవారి ఆలయంలో లక్ష్మి సిలక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ వారి బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ఇదిగో ఆయన హాజరయ్యారు.
సమాజంలో సౌభాగ్యం, శాంతి, సమృద్ధిని కలగజేయాలనే భావనతో గ్రామదేవతకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆశడమాసంలో ప్రజలందరు భక్తి శ్రద్దలతో బోనం చేసి అమ్మవారిని కోలిస్తే స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని ఆయన తెలిపారు.అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని పిల్లజల్లా, గొడ్డు గోదా అన్నింటిని కాపాడాలని అమ్మవారికి జరిపించాలని ఆయన తెలిపారు.
నగర ప్రజలందరు అష్టఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేసారు .మహాలక్ష్మినగర్ వాసులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పండుగను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని, డప్పుల వాయిద్యాలతో, పాటల కోలాటాలతో మాల ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి లావణ్య లింగం, వస్త్ర వ్యాపారి శీతల్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మినారాయణ,పార్షి రాజు, అల్లాడి రాజు, భోగ గంగాధర్, ఆనంద్, శివునూరి భాస్కర్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.