calender_icon.png 12 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కోటాతో కవితకేం సంబంధం?

12-07-2025 12:48:38 AM

  1. ఆమెను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు 
  2. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ 
  4. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సంబురాలు 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె స్ నేతలు సంబరాలు నిర్వహించారు. గాంధీభవన్‌లో శుక్రవారం టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సం బురాలు జరుపుకున్నారు. అమ్మవారి చిత్రపటానికి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నా రు. రాహుల్‌గాంధీ ఆశయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని తెలిపారు. ఈ బిల్లు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల కృషి అభింనదనీయమని, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి రుజువైందని  పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లకు, ఎ మ్మెల్సీ కవితకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మేం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే, కవిత రంగులు తనవల్లే అయిందని చెప్పుకోవడం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, వివి ధ కార్పొరేషన్ల చైర్మన్లు మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్‌గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్, అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు.

ఏదైనా కాంగ్రెస్‌తోనే సాధ్యం: కేకే 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 45 ఏళ్ల బీసీల కల నెరవేరిందని, ఏదైనా కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. సమానత్వంలో బీసీ రిజర్వేషన్లు ఒక భాగమని, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం రేవం త్‌రెడ్డికి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నార ని విమర్శించారు. 

 బీసీలకు బీజేపీ వ్యతిరేకం: మంత్రి పొన్నం 

బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. స్థానికంలో బీసీలకు తమ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు తమ నోటికాడి ముద్దను లాక్కోవద్దని, బీసీల నుంచి వ్యతిరేకతను తెచ్చుకోవద్దని మంత్రి పొన్నం సూచించారు. బీసీలకు సీఎం పదవి ఇస్తామని చెప్పిన బీజేపీ.. చివరకు బీసీ నేత బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని మంత్రి పొన్నం గుర్తు చేశారు. 

పండుగ వాతావరణం: షబ్బీర్‌అలీ 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొందని, బీసీ లు సంబురాలు చేసుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రా హుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పా టు పార్టీ పెద్దలందరూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతార ని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చుకున్నట్లు చెప్పారు. బీసీ డిక్లరేషన్ తన నియోజకవర్గంలో జరగడం సంతోషంగా ఉందన్నారు.