12-07-2025 01:14:25 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణను గ్లోబల్ లైఫ్ సెన్సై స్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధం గా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50 వేల కోట్ల కు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫలితంగా కొత్తగా 60వేల మందికి ఉపాధి లభించిందన్నారు.
శుక్రవారం హైటెక్ సిటీ ట్రైడెంట్ హోటల్‌లో ఈటీ ఫార్మా టెక్ ఇన్నోవేటివ్ కాంక్లేవ్ రెండో ఎడిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2024--25లో రూ. 66 వేల కోట్ల విలువైన లైఫ్ సెన్సైస్ ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేసిందని, ప్రపం చానికి కావాల్సిన మూడింట ఒక వంతు వ్యాక్సిన్లను అందిస్తూ హైదరాబాద్ ‘వ్యాక్సిన్ రాజధాని’గా ప్రసిద్ధి చెందిందన్నారు.
దేశంలో అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్ నుంచి ‘మేడ్ ఇన్ తెలంగాణ’ స్టెంట్లు, కేథెటర్లు యూఎస్, జపాన్‌తో సహా 89 దేశాల కు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. లైఫ్ సెన్సైస్‌లో 5 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఇందుకోసం రూ.లక్ష కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూ హాన్ని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. వికారాబాద్, నల్గొండ, మెదక్‌లో ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
త్వరలోనే ‘లైఫ్ సెన్సైస్ యూనివర్సిటీ’
అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే ‘లైఫ్ సెన్సైస్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను జీవశాస్త్ర దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అందించబోతున్నట్టు వివరించారు. ఇప్పటికే ‘యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీ’ ద్వా రా డాక్టర్ రెడ్డీస్, అరబిందో లాంటి సంస్థలతో కలిసి తెలంగాణ యువతకు శిక్ష ణ ఇస్తున్నామని, సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(సీ4ఐఆర్) భాగస్వామ్యంతో సైన్స్ గ్రాడ్యూయేట్లకు లైఫ్ సెన్సైస్ రంగంలో నిపుణు లను తీర్చి దిద్దుతున్నామని పేర్కొన్నారు.
లైఫ్ సెన్సైస్ రంగంలో ‘తెలం గాణ’ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ లైఫ్ సెన్సైస్ పాలసీ’కి శ్రీకారం చుట్టామని వెల్లడించామని, అది చివరి దశలో ఉందని వెల్లడించారు. ఈ రంగాన్ని కేవలం పరిశ్రమ లు లేదా ఆర్ అండ్ డీ సెంటర్లకే మేం పరిమితం చేయడం లేదని, ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపా రు.
ఇప్పటికే మూడు జిల్లాల్లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముం దే గుర్తించేందుకు ఏఐ ఆధారిత స్క్రీ నింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, సత్ఫలితాలు రావడంతో రా ష్ర్టంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పలు దిగ్గజ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.