12-07-2025 12:50:45 AM
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ధర్పల్లి జూలై 11: (విజయ క్రాంతి): వివిధ పనులకై మండల కార్యాలయానికి వచ్చే ద రఖాస్తుదారుల నుండి వారి పనుల కు రేటు కట్టి ముక్కుపుండి వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయివివిధ పనుల నిమిత్తం ధర్పల్లి తాసిల్దార్ కా ర్యాలయానికి వచ్చే వారి నుండిలబ్ధిదారుల నుండి శైలిలో ఈ ఉద్యోగి వస్తువులకు పా ల్పడుతున్నాడు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటికలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునే లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలను జారీ చేసిన విషయం విధితమే.
ఇది అదనుగా చే సుకున్న ధర్పల్లి మండలం రెవెన్యు ప్రభుత్వ కార్యాలయ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి చాప కింద నీరులా లబ్ధి దారులకు అవసరమైన ఇసుక, మొరం అనుమతులను ఇవ్వడానికి ఒక్కో దరఖాస్తుకు ఒ క్కో ధరను నిర్ణయిస్తూ ఇసుక, మొరం అనుమతుల కోసం వచ్చిన లబ్ధిదారుల వద్ద అడ్డగోలుగా వసూళ్లు కు పడుతున్నట్టు విశ్వా సనీయ సమాచారం.
ఈ వసూళ్లను గుట్టు చ ప్పుడు కాకుండా ఎంతో చాకచక్యంగా ఆఫీ సు వెనకాల తిష్ట వేసి లావాదేవీల జరుపుతున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.నిత్య కృత్యంగా మారిన ఈ ఉద్యోగి వ్యవహారం అదుపు లేకుండా సాగుతోంది ప్రభుత్వ ఉ ద్యోగికి అడిగినంత ముట్ట చెపితే చాలు లబ్ధిదారులు ఇచ్చే దరఖాస్తులను ఎంక్వయిరీ చేయకుండానే చేస్తుంటాడు.
ఒకవేళ లబ్ధిదారులు డబ్బులను ఇవ్వకుండా నేరుగ అం దించే దరఖాస్తులను విచారణ పేరుతో పెం డింగ్లో పెట్టి కాలయాపన చేస్తూ మధ్యవర్తుల చే సంప్రదింపులు చేయడం ఈయన గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ యనకు ప్రభుత్వ నిబంధనలతో పట్టింపు లేదు. అధికారుల అండ ఉంటుంద ని అందుకే మరీ రెచ్చిపోతున్నారని ముక్కు పిండి వసూళ్లకు పాల్పడు తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.
మధ్యవర్థుల ద్వారా వచ్చిన దరఖాస్తులు ఫైళ్లను వే గంగా క్లియర్ చేస్తారు. ఇది ఇలా ఉండగా మధ్యవర్తుల ఎన్‌యు సంప్రదిస్తే ఈ మండ ల కార్యాలయంలో పని జరిగినట్లేనని ప్రజ లు ఆరోపిస్తున్నారు. మధ్యవర్తుల ద్వారా వ చ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను ఎలాంటి ఎంక్వయిరీలు చేయకుండానే ఓకే చేప్పడం ఇందుకు నిదర్శనంఈ రెవెన్యూ కార్యాలయంలో కాళ్లు అరిగే వరకు తిరిగిన కాని ప నులుమధ్యవర్తుల ద్వారా అడిగింది అప్పజెప్పితే న్యాయసంగా అవుతున్నాయి.
ఎలాం టి ఎంక్వయిరీ నిర్వహించకుండా క్షణాల్లో అనర్హులకు రేషన్ కార్డు మంజూరు కావడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంచే నియమించబడిన ప్రభుత్వ అధికారి కాసులకు కక్కుర్తి పడి చేతివాటం మొదలు పెట్టాడు. ప్రభుత్వ లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పం పిణీ కార్యక్రమం.బ్ధిదారుల ఎంపిక విషయం లో ఈ అధికారి ప్రవర్తనతో అలసత్వం జరుగుతుంది.
గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై దాడులు చేపట్టిన నప్పటికిని కారులో పనితీరులో ఎలాంటి మార్పు చేయడం లేదు. ధర్పల్లి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభు త్వ ఉద్యోగి పై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.