15-07-2025 12:03:27 AM
కర్మన్ ఘాట్ ఆలయంలో చెక్కుల పంపిణీ
ఎల్బీనగర్, జులై 14 : బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ఉత్సవాలను శాంతియుతంగా సంబురంగా నిర్వహించుకోవాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాలకు ఆర్థికసాయం అందజేస్తున్నది. ప్రభుత్వ ఆర్థికసాయం కోసం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా దేవాలయాల కమిటీల ప్రతినిధులు దరఖాస్తులు చేశారు.
ప్రభుత్వం మొత్తం 223 దేవాలయాలకు ఆర్థికసాయం మంజూరు చేసింది. ఇందులో భాగంగా చంపాపేట డివిజన్ లోని కర్మన్ ఘాట్ ఆలయంలో సోమవారం ఆలయ కమిటీల ప్రతినిధులకు చెక్కులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోనాల పండుగ మన రాష్ట్రానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చే పండుగ అన్నా రు.
ప్రజలు సమిష్టిగా పాలుపంచుకుని జరుపుకునే ఉత్సవాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బోనాల పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయికోటి పవన్,
కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహరెడ్డి, ధర్పల్లి రాజ శేఖర్ రెడ్డి, లచ్చి రెడ్డి, చింతల అరుణా సురేందర్ నాథ్ యాదవ్, సుజాతా నాయక్, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.