15-07-2025 12:03:13 AM
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 76 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు.
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి , డి ఆర్ ఓ పద్మజ రాణి, స్వయంగా స్వీకరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డిపిఓ సాయిబాబా, జిల్లా సంక్షేమ అధికారిని లలిత కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సప్రజావాణిలో భూ సమస్యల 14 , పింఛన్లు 7, ఇందిరమ్మ ఇండ్ల కోసం 6, ఇతర సమస్యలు 39, మొత్తం 66 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.