12-01-2026 12:00:00 AM
పార్టీ కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే
తాండూరు, జనవరి11, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా జలాల మండలం కోకట్ గ్రామ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటయ్య ముదిరాజ్ తన 100 మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి .. పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేరుతున్నారని అన్నారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చూస్తానని..నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.. ఇంకా కార్యక్రమంలో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.