calender_icon.png 19 November, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

19-11-2025 05:54:00 PM

మెట్ పల్లి (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు వేడుకలు ఘనంగా జరిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలు అభివృద్ధి పనులు సంస్కరణలు మహిళలకు బడుగు బలహీన వర్గాల వారందరికీ ఆదర్శమన్నారు. దేశాన్ని నడిపించిన చరిష్మాగల రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగన్యులని, భారత తొలి మహిళ ప్రధాని, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.

అనంతరం స్వచ్ఛ మున్సిపాలిటీలో భాగంగా కోనేరు శుద్ధిపై మొదటి స్థానం వచ్చిన సందర్భంగా కోనేరును పరిశీలించారు.పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు ఉపాధ్యాయ బృందం అదనపు తరగతి గదులు కావాలని కోరడంతో విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఫోన్ చేసి వెంటనే గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మహేందర్, పట్టణ మహిళా సంఘాల అధ్యక్షురాలు బబ్బురి లక్ష్మి, సిహెచ్ పద్మ, ఆకుల లింగారెడ్డి, ఎర్రోళ్ల హనుమాన్లు, రాజయ్య, పల్లి శేఖర్ గౌడ్, దేవేందర్, మర్రి సహదేవ్, పిప్పర రాజేష్, జెట్టి లక్ష్మణ్ బెజ్జారపు శ్రీనివాస్, రాంప్రసాద్, రాజు, రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.