calender_icon.png 19 November, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలి

19-11-2025 05:56:22 PM

జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి..

సదాశివనగర్ (విజయక్రాంతి): సిడ్స్, పెస్టిసైడ్ దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పురుగుమందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. రైతు వేదికలో దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. లైసెన్సులు లేకుండా దుకాణాలను నడపవద్దని సూచించారు. రైతులు తీసుకున్న ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదును ఇవ్వాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, ఏఈఓలు, పెస్టిసైడ్ దుకాణదారులు, డీలర్లు పాల్గొన్నారు.