19-11-2025 05:59:30 PM
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి. సలీం..
మున్సిపల్ అధికారులకు వినతి
చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు ఆదివారం పండుగ సెలవులు పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎండి సలీం కోరారు. బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు చండూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ అరుణ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీలో అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న వారాంతపు ఆదివారం సెలవు పండుగ సెలవులు ఇవ్వకపోవడం అన్యాయం అని అన్నారు.
కార్మికుల వేతనాల నుండి కటింగ్ చేసిన పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ కాకుండా పోవడంతో కార్మికులు వైద్యం పొందలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నెలనెలా పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించే విధంగా ఆదివారం పండుగ సెలవులు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జేరిపోతుల ధనంజయ, జిల్లా కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, కత్తుల సైదులు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బిపంగి నాగరాజు, ఇర్గి యాదయ్య, నల్లగంటి లింగస్వామి, కోశాధికారి రేణుక, యూనియన్ నాయకులు గండూరి వెంకన్న, కృష్ణయ్య, ఇర్గి నాగరాజు, రమేష్, కృష్ణ, శ్రీరాములు, దనయ్య, వెంకన్న, అలివేలు, చంద్రమ్మ, కలమ్మ, రవమ్మ, ముత్తమ్మ, జంగమ్మ, ఎల్లమ్మ, రజిత, తదితరులు పాల్గొన్నారు.