calender_icon.png 9 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్, చంద్రబాబులది రహస్య ఒప్పందం

09-01-2026 12:27:04 AM

  1. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు దుష్ర్పచారం 
  2. ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు
  3. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): తనపై ఉన్న గౌరవంతో రాయల సీమ ఎత్తిపోతలను ఆపారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెపుతుంటే.. తామెప్పుడూ అలాంటి హామీలివ్వలేదని చంద్రబాబు అన డం హాస్యాస్పదంగా ఉన్నదని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య రహస్య ఒ ప్పందం ఉందని ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. రాయలసీమ కు తాము తలపెట్టిన ఎత్తిపోతల పథకం సంజీవని లాంటిదన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్న తమపై.. విమర్శలు చేస్తుండటం బాధాకరమని జగన్ వాపోయారు. రాయల సీమ ప్రజలకు చంద్రబాబు విలన్‌లా మారారన్నా రు.

సొంత రాష్ట్రా న్ని స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టారని, ఇం దుకు రేవంత్ ఇచ్చిన స్టేట్‌మెంటే సాక్ష్యమని పేర్కొన్నారు. రేవంత్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేశారని సంచలన ఆరోపణలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుక గొప్ప ఉద్దేశం ఉందని, అలాంటి ప్రాజెక్టును మంత్రులు వద్దంటుండటంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు.

తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్టీఆర్‌ను, నేడు జన్మనిచ్చిన సీమ ను వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడలేదని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని, 2021లో ప్రాజెక్టుల పనులు ఆపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందని జగన్ తెలిపారు. అయినా పనులు చేస్తుంటే ఎన్జీటీ రూ.900 కోట్ల జరిమానా విధించిందన్నారు. పవర్ హౌస్ ద్వారా తెలంగాణ ఇష్టారీతిన నీళ్లు తీసుకుంటుంటే.. ఏపీ శ్రీశైలం 834 అడుగుల వద్ద నీరుతోడుకునే పరిస్థితి ఉందన్నారు.