calender_icon.png 9 January, 2026 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల అభివృద్ధికి 10 కోట్లు

09-01-2026 12:20:21 AM

  1. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  2. ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధుల విడుదల

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి మరో విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 138 మున్సిపాలిటీలకు పలు దఫాలుగా నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం, తాజాగా రాష్ర్ట ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు రూ.10 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్ సర్కార్ నిధుల విడుదలను వేగవంతం చేసింది.

ప్రస్తుతం విడుదల చేసిన నిధులను మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి, అత్యవసర మరమ్మతులు, మురుగునీటి కాలవల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల మరమ్మతులకు ఉపయోగించడానికి మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసేందుకు రాష్ర్ట వాటా నిధులను ప్రభుత్వం నేరుగా మున్సిపాలిటీలకు మళ్లిస్తోందని ఉన్నతాధికారులుపేర్కొన్నారు.