calender_icon.png 9 January, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ ఏమైంది?

09-01-2026 12:44:02 AM

2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్

  1. అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన
  2. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ
  3. అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
  4. విద్యార్థి నాయకులు, నిరుద్యోగుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): పోటీ పరీక్షలకు అడ్డాగా ఉండే హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ మరోసారి నిరుద్యోగుల ఆందోళనతో దద్దరిల్లింది. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నిరుద్యోగులు కదం తొక్కారు. శాంతియుతంగా మొదలైన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకారులు, పోలీసుల మధ్య జరిగిన తోపులా టతో ఆశోక్‌నగర్ పరిసరాలు కాసేపు రణరంగాన్ని తలపించాయి. నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు గుమిగూడారు. అక్కడి నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ముందుకు సాగారు. నోటిఫికేషన్ల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నాం.

ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయా లి’ అని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ర్యాలీగా వస్తున్న నిరుద్యోగులను అశోక్‌నగర్ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు నాయకులను, నిరుద్యోగ అభ్యర్థులను ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగుల ఆకస్మిక ఆందోళనతో అశోక్‌నగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ వెళ్లే మార్గంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  

జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడ రాహుల్?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అశోక్‌నగర్ నిరుద్యోగ యువత నిరసన చేపట్టడంపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. జాబ్ నోటిఫికేషన్ ఎక్కడ రాహుల్ గాంధీ? ని నిరుద్యోగులు రోడెక్కి ధర్నా చేసి నిలదీస్తున్నారని విమర్శించారు. 

నిరుద్యోగులపై సర్కార్ దమన కాండ

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ‘నిన్న దిల్‌సుఖ్‌నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరం గా విరుచుకుపడటం తీవ్రంగా ఖండిస్తు న్నాం. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నా రని, వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారంటూ గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు.

అధికారంలోకి రాగానే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నిరంకుశ త్వం రాజ్యమేలుతున్నదని, పోలీసు రా జ్యం నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నా రని మండిపడ్డారు.

రెండేళ్లలో 10 వేల ఉ ద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉ ద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చే స్తున్నారని,  విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్ని స్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలని, దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.