19-09-2025 09:52:25 PM
కలెక్టర్ కు బోరజ్ మండల వాసుల వినతి
ఆదిలాబాద్,(విజయక్రాంతి): బోరజ్ మండలంలో మండల కార్యాలయ స్థలం మార్చాలని, కొత్త పోలీస్ స్టేషన్ సైతం ఏర్పాటు చేయాలని కోరుతూ బోరజ్ మండల పలువురు నాయకులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలిసిన సమస్యలను కలెక్టర్ కు వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోరజ్ మండలంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల కార్యాలయంతో విద్యార్థులకు ఆసౌకర్యంగా, ఇబ్బందిగా మారిందని తెలిపారు. మండల కార్యాలయానికి వస్తున్న జనాల రాకపోకల ద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని తెలియజేశారు.
మండలంలోని చెక్ పోస్ట్ కార్యాలయం ముసివేసిన సందర్భంగా మండల కార్యాలయాన్ని చెకపొస్టు కార్యాలయానికి మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. చెక్ పోస్టు స్థలంలో పోలీసు స్టేషన్ ఏర్పాటుకు అనువైన స్థలం ఉన్నందున కొత్త మండలన్ని దృష్టిలో పెట్టుకుని మండలానికి పోలీసు స్టేషన్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మండల కేంద్రం నుండి సబ్-స్టేషన్ వైపు గూడ, రాంపూర్, సిరసన్న వెల్లే దారిలో ఎయిర్టెల్ ఫైబర్ లైన్ కోసం గుంతలు తవ్వి వదిలేశారని, గత మూడు నెలల కాలంగా ఆ గుంతలతో ప్రమాదలు జరుగుతున్న ఎవరు పట్టించుకోవట్లేదనీ తెలిపారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చిన పట్టించుకునే వారే లేరనీ, దయచేసి తమరు చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండ చూడగలరనీ కోరారు.