20-09-2025 12:22:05 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): దసరా పండగ నేపథ్యంలో ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఖండించింది. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రచారంలో వాస్తవంలేదని స్పష్టం చేసింది. ప్రధాన పండగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీల్లో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని, మిగతా సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.