19-09-2025 09:55:35 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డ్ సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ రైన్ కోట్స్, ఉలెన్ జాకెట్స్ అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డు సిబ్బందికి విధి నిర్వహణలో వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. యూనిఫాం సర్వీస్ డెలివరీలో అందరూ సమానమేనని, అందరము ఒకే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిమని తెలిపారు.