calender_icon.png 5 September, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

05-09-2025 07:07:38 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ఎల్లప్పుడూ ప్రజలకు  అందుబాటులో ఉండి, నాణ్యమైన వైద్యం సేవలు అందించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం నవ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని పట్టణంలోని భాస్కర్ టాకీస్ వద్ద నూతన భవనములోకి మార్చిన సందర్భంగా  ఆస్పత్రిని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు  చెరుకు సుధాకర్ తో ప్రారంభించి మాట్లాడారు.

సామాన్యులకు సైతం అందుబాటులో కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్న నవ్య మల్టీ యజమాన్యాన్ని ఆయన అభినందించారు.నవ్య ఆసుపత్రిలో గత పది సంవత్సరాలుగా ఎంతోమంది రోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు.ఈ హాస్పిటల్ లో అన్ని రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారని,నవ్య ఆసుపత్రి జిల్లాలో మంచి పేరు,ప్రఖ్యాతలు తెచ్చుకుందని కొనియాడారు.