09-10-2025 12:35:23 AM
హుజూరాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాం తి) : హుజూరాబాద్ పరిధిలోని బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణంలోని సహాయ షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారికి విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ..
ప్రభుత్వం నుంచి రెండేండ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలల నుంచి బయటికి పంపిస్తున్నారని వాపోతున్నారు. బుక్స్, భోజన ఖర్చులు అందక అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. దసరా సెలవుల తర్వాత విద్యార్థులను పాఠశాల ఆవరణలోకి సైతం రానివ్వడంలేదన్నారు.
ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను అందించి, విద్యార్థుల భవిష్యత్ ను నిలబెట్టాలన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంటలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.