calender_icon.png 9 October, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ గేమింగ్ మోసం..ఐదుగురు అరెస్ట్

09-10-2025 12:36:50 AM

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయిశ్రీ తెలిపిన వివరాల ప్రకారం సుపాగో వ్బుసైట్లోని డాడ్జ్బుక్777 వంటి నకిలీ ప్లాట్ఫారమ్ల ద్వారా గేమింగ్ బెట్టింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టైన వారు దొప్పలపూడి నవీన్కుమార్, వంకాద్రి సందీప్కుమార్, చింతలపాటి పృథ్వీరామరాజు, చింతలపాటి పవన్ వెంకట నాగభరద్వాజ్, మామిడిశెట్టి రామాంజనేయులు.

వీరంతా సత్యనారాయణ వర్మ అనే ప్రధాన నిందితుడి సూచనలతో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను ఆకట్టుకునే విధంగా అధిక లాభాల వాగ్దానాలు చేస్తూ డబ్బు లాగుతున్నట్టు దర్యాప్తులో తేలింది. వీరంతా కలసి 120కి పైగా బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులు వినియోగించి సుమారు రూ.14 లక్షల మోసపూరిత లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా 2 ల్యాప్టాప్లు, 30 మొబైల్ ఫోన్లు, 32 చెక్బుక్స్, 23 ఎటీఎంలు, 48 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ జి.విజయ్కుమార్ నేతృత్వంలో, ఏసీపీ ఎ.రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు అపరిచిత లింకులు, ఓటీపీ పిన్లు, బ్యాంక్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.