09-10-2025 12:35:12 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నగరవాసుల భద్రతే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రహదారులపై గుంతలను పూడ్చడం, క్యాచ్‌పిట్‌లకు మరమ్మతులు చేయడం, ప్రమాదకరంగా ఉన్న సెంట్రల్ మీడియన్లను సరిచేయడం వంటి పనులను ముమ్మరం చేసింది. బుధవారం నాటికి నగరంలోని ఆరు జోన్ల పరిధి లో మొత్తం 13,372 గుంతలను పూడ్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
నగరవ్యా ప్తంగా ఇప్పటివరకు మొత్తం 16,063 గుంతలను గుర్తించగా, వాటిలో 83 శాతానికి పైగా పనులను పూర్తి చేశారు. కేవలం బుధవారం ఒక్కరోజే 415 గుంతలను పూడ్చివేసి, రహదారులను ప్రయాణానికి అనువుగా మార్చా రు. 753 క్యాచ్‌పిట్‌లకు మరమ్మతులు చేయగా, ప్రమాదకరంగా ఉన్న 354 చోట్ల క్యాచ్‌పిట్‌లకు కొత్త మూతలను ఏర్పాటు చేశారు.
అలాగే, 18 సెంట్రల్ మీడియన్లకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అత్యధికంగా సికింద్రాబాద్ జోన్‌లో 3,364 గుంతలను గుర్తించగా, వాటిలో 2,977 గుం తలను పూడ్చివేశారు. ఆ తర్వాతి స్థానంలో ఎల్బీనగర్ జోన్‌లో 3,027 గుంతలకు గాను 2,669 గుంతలను బాగుచేశారు.