calender_icon.png 1 May, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలే

09-04-2025 12:28:52 AM

  1. కేంద్ర ప్రభుత్వ  సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలి

ఎంపీ డాక్టర్ కే.లక్ష్మణ్

ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తం గా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. ఈ మేరకు  మంగళవారం భోలక్ పూర్ డివిజన్ లోని మహాత్మానగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కో-ఆర్డినేటర్ బిజ్జి కనకేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రజాధరణ పొందుతుంటే ఇది చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఇటీవల పార్లమెం టులో వక్ఫ్ బిల్లు సవరణ కోసం బిల్లు ప్రవేశపెడితే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అడ్డుకున్నాయని, ఈ మూడు పార్టీలు తోడు దొంగలేనని అన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించారని ఆరోపించారు. అదే బాటలో సీఎం రేవంత్ రెడ్డి సైతం వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఎన్నో భూములను అమ్ముతూ రియల్ ఎస్టేట్ కు దారాదత్తం చేస్తున్నారని  ఆరోపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి పోలింగ్ బూత్ లో నిర్వహిస్తూ బీజేపీ సిద్దాంతాలు, ఆశ యాలు ప్రజలకు వివరిస్తూ పార్టీకి వారిని మరింత చేరువ చేయాలన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని అందుకు కార్యకర్తలు  అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ విశ్వం, భోలక్ పూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్, బీజేపీ మహంకాళి, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్, నాయకులు చంద్రమోహన్, నిత్యానంద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముషీరాబాద్‌లో డివిజన్ బీజేవైఎం అధికార ప్రతినిధి బుర్రా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెం డాను ఆవిష్కరించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, పార్టీ నాయకులు సాయి కుమార్, అనిల్, కిరణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.