calender_icon.png 2 May, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫూలే విగ్రహం కోసం కవిత ధర్నా సిగ్గుచేటు

09-04-2025 12:25:44 AM

  1. ధర్నా చౌక్ అపవిత్రమైందని వేదిక ప్రాంతాన్ని  ఫినాయిల్‌తో శుద్ధి

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి

ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహాన్ని పెట్టాలని కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్ లో ధర్నా చేయడం సిగ్గుచేటు అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం సాయంత్రం ధర్నా చౌక్ లో కల్వకుంట్ల కవిత ధర్నా చేసిన వేదిక, ధర్నా చౌక్ అపవిత్రం అయిందని ఫినాయిల్ పోసి శుద్ధి చేశారు.

అనంతరం పిడమర్తి రవి  మాట్లాడుతూ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు పూలే గురించి మాట్లాడనీ కల్వకుంట్ల కవిత అధికారం పోయిన వెంటనే బీసీ నినాదం, పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలి అని ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. ఎండలో బిసి సమాజాన్ని కూర్చోబెట్టి తన కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఏసీ గదుల్లో కూర్చున్నారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఎత్తివేసి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు లేరని కల్వకుంట్ల కవిత వాళ్ల నాన్న కేసీఆర్ ప్రకటించడం బిఆర్‌ఎస్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమ న్నారు. కల్వకుం ట్ల కవిత బీసీ ఉద్యమం చేసి యావత్ బీసీ సమాజం చెవిలో పువ్వులు పెడుతుందని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న బీసీల నాయకత్వాన్ని డమ్మీ చేయడానికి కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

అధికారంలో ఉండి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ చేసి ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసి ఇంట్లో కూర్చోబెట్టిందని. అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులకు తీవ్ర అన్యాయం చేసిన మీ నాన్న, పూలే విగ్రహం పేరుతో బీసీలకు అన్యాయం చేయొద్దని అన్నారు.

కల్వకుంట్ల కవిత బయటకు రావద్దని ఇంట్లో కూర్చోవాలని తెలంగాణ ప్రతిష్టకు తీవ్రంగా ఆటంకం కలిగించి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా చేసిన కల్వకుంట్ల కవితకు ధర్నా చౌక్లో ధర్నా చేసే అర్హతలు లేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తుంటే ముందే పసిగట్టి ఢిల్లీలో ధర్నా చేసి మహిళల కోసం ఏదో చేసినట్టు కలరింగ్ ఇచ్చుకునే కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తుంటే చూసి ఓర్వలేక బీసీల కోసం ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బొమ్మెర స్టాలిన్, డాక్టర్ మీసాల మల్లేష్, ఎండి రహీం, బోరెల్లి సురేష్, నక్క మహేష్, చెర్రీపోతుల సాయన్న, వరలక్ష్మి,సాగంటి శేఖర్, మీసాల మహేష్, బొల్లెద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.