08-10-2025 05:27:38 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ పట్టణంలోని స్థానిక నాగ భూషణం హై స్కూల్ పాఠశాలకు చెందిన కొచ్చర్ల వికుర్వన్ అనే 6వ తరగతి విద్యార్ధికి నేషనల్ సైనిక్ స్కూల్ లో సీటు లభించింది. ఇటీవల విడుదలైన 3వ లిస్టులో ఝార్ఖండ్ రాష్ట్రంలోని టిలైయా సైనిక్ స్కూల్ కు ఎంకైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు కిరణ్ - మాధవిలు స్థానిక గురుకుల పాఠశాలలో సిఆర్టిలుగా పని చేస్తున్నారు. తమ కుమారుడు సైనిక స్కూలుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీటు సాధించిన వికుర్వన్ ను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.