calender_icon.png 8 October, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా

08-10-2025 05:29:38 PM

హైదరాబాద్: తెలంగాణ బీసీల 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనాలు విన్న సీజే జస్టిస్ ఏకే సింగ్ ధర్మాసనం రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. రేపు స్థానిక ఎన్నికలకు నోటీఫికేషన్ జారీపై పిటిషనర్ స్టే కోరాడంతో హైకోర్టు ఏమీ చెప్పలేదు. అయితే ఎన్నికల షెడ్యూల్ ను గెజిట్ లో ప్రకటించారా అని కోర్టు ప్రశ్నిస్టే ఏజీ ఏమీ సమాధానం చెప్పలేదు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీ రిజర్వేషన్లపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనం వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ మొదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను న్యాయస్థానానికి అందించారు. ఈ సమయంలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ పై స్టే ఇవ్వడం సరికాదన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ రిజర్వేషన్ల బిల్లు చేసి జీవో తెచ్చారని ఎంఎ సింఘ్వీ వివరించారు. పూర్తి వాదనలు విన్న తర్వతే జీవో నంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని, ఈ జీవోపై ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానానికి వాయిదా వేసింది.