11-07-2025 12:51:54 AM
జోనల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్?
శేరిలింగంపల్లి, జూలై 10: శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో కం ప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అభిలాష్ అనే తాత్కాలిక ఉద్యోగి అర్ధరాత్రి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే కార్యాలయంలోని లాగిన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఓటీపీ జోనల్ కమిషనర్‌కి రావడంతో ఆయన వెంటనే అప్రమత్తం అయ్యి జడ్పీ కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశాడు.
ఉదయం ఘటనపై ఆరా తీసిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే విచారణకు ఆదేశించాడు. దీనిపై విచారణ జరిపిన సీపీ శ్యామ్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ లాగి న్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. కంప్యూటర్ ఆపరేట ర్ అభిలాష్‌ను జోనల్ కమిషనర్ హే మంత్ భోర్ఖడే వెంటనే సస్పెండ్ చేశా రు. గతంలో కూడా అభిలాష్ టౌన్ ప్లానింగ్ ఏసిపి, సెక్షన్ ఆఫీసర్లు లాగిన్స్ ఓపెన్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.