calender_icon.png 21 September, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్‌పన్‌లో దసరా, బతుకమ్మ సంబురాలు

21-09-2025 12:00:00 AM

అమీన్‌పూర్, సెప్టెంబర్ 20: విజయదశమి సందర్భంగా బీరంగూడలోని బచ్‌పన్  అకాడమిక్ హైట్స్ స్కూల్‌లో శనివారం నిర్వహించిన సంబురాలు అంబరాన్ని అంటాయి. విద్యార్థుల నృత్యాలు, బతుకమ్మ, దసరా పండుగల గురించి వారు చేసిన ప్రసంగాలు అలరించాయి. విద్యార్థినులు తాము చేసిన బతుకమ్మలను ప్రదర్శించి, దాండియా ఆడా రు. బతుకమ్మ పోటీలో గెలిచిన విద్యార్థినులకు డైరెక్టర్ సిహెచ్ శ్రీనివా సరావు, ఆర్ శిరీషారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీరాఘవేంద్ర పాల్గొని విద్యార్థులకు, మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.