calender_icon.png 12 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు బ్రేక్

10-10-2025 12:44:33 AM

- కోర్టు తీర్పు నేపథ్యంలో మందకొడిగా నామినేషన్లు

-బీసీ నేతల్లో నిరుత్సాహం

కరీంనగర్, అక్టోబరు 9 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ గురువారం విడుదలై నామినేషన్ ప్రక్రియ మొదలయింది. ఇదేరోజు సాయం త్రం హైకోర్టు ధర్మాసం బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడంతో స్థానిక పోరుకు బ్రేక్ పడినట్లయింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారికి కోర్టు తీర్పు నిరాశ ను మిగిల్చింది. కోర్టు తీర్పుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీతోపాటు కొన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదంవల్లే ఇలా జరిగిందనే నిం దారోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీ సంఘాలు ఆందోళనకు కార్యాచరణ రూ పొందించేందుకు సిద్ధమవుతున్నాయి. కోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడి మొదటి విడత నామినేషన్ల ప్ర క్రియ మొదటిరోజుతో ఆగిపోయినట్లయిం ది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ఎంపీటీసీ స్థానానికి, రెండు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. జగిత్యాల జిల్లాలో కథలాపూర్, ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ స్థా నాలకు ఒక్కో నామినేషన్ దాఖలయింది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలకు, సైదాపూర్ జెడ్ పి టి సి స్థానానికి ఒక నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లా లో ఒక ఎం పి టి సి స్థానానికి నామినేషన్లు దాఖలయ్యాయి.

కోర్టు స్టే ఇవ్వకుంటే శుక్ర, శని వారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్ లు దాఖలై ఉండేవి. మొదటి విడతలో నాలుగు జిల్లాల్లో 30 జడ్పీటీసీ, 311 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు ఉండగా కోర్టు స్టేతో మొత్తం ప్రక్రియకే బ్రేక్‌పడినట్లయింది.