calender_icon.png 12 October, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ప్రాంతానికి మారుపేరే మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు

10-10-2025 12:43:22 AM

- శ్రీధర్‌బాబు చిత్రపటానికి ముంథని గౌడ సంఘం నాయకుల క్షీరాభిషేకం 

మంథని అక్టోబర్ 9 (విజయక్రాంతి) మంథని లో గౌడ సంఘం భవనం కోసం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ. 20 లక్షల రూపాయల నిధులు గౌడ సంఘం భవనం కోసం మంజూరు చేయించారని, నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గురువారంమంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మంథని నియోజకవర్గ గౌడ సోదరులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షులు తా టి బాలయ్య గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నా యకులు అజీమ్ ఖాన్, జిల్లా సోషల్ మీడి యా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్ గౌడ్ లు మాట్లాడుతూ...మంథనిలో గౌడ సంఘం భవనం నిర్మించుకొని, కమ్యూనిటీ హాల్ గా, అన్ని రకాలుగా మా గౌడ సంఘం కు ఉపయోగపడేటట్టుగా చేసుకుంటామ న్నారు.ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ ఏ అభివృద్ధి విషయంలోనైనా కూడా ముందుండి మా నా యకుడు శ్రీధర్ బాబు చేస్తున్నారని,ప్రతిపక్ష నాయకులు శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి చూసి వాళ్ల కండ్లు ఓర్వలేకనే మాపై మా కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారన్నారు.

మీకు నోటికి వచ్చినటువంటి మాటలు ఏ మో ఏమో మాట్లాడుతున్నారని, మీకేమైనా సూచనలు ఇవ్వాలని ఆలోచన వస్తే అభివృద్ధి పథంలో మాకు సలహాలు ఇవ్వండని, ఆ సలహా సూచనతోనే ముందుకు వెళ్తాం, అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అణగారిన వర్గాలను ఆదుకున్న ఘనత మంత్రి శ్రీధర్ బాబు కే దక్కుతుందన్నారు.

గౌడ సంఘం భవనానికి నిధులు కేటాయించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు దుద్దిళ్ళ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామని, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రె స్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, గౌడ సంఘం నాయకులు, గౌడ కుల సభ్యులు పాల్గొన్నారు.