calender_icon.png 29 May, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మర్ క్యాంప్ విద్యార్థులకు అల్పాహారం

28-05-2025 01:53:35 PM

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు విద్యార్థులకు బుధవారం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పట్టణ అధ్యక్షులు, (ఎక్స్ సర్వీస్మెన్, బి ఎస్ ఎఫ్) షౌకత్ పాషా అల్పాహారం అందించారు. బుధవారం ఉదయం విద్యార్థులకు నిర్వహిస్తున్న క్యాంపులో వారు బ్రెడ్ జామ్, సాస్, అరటి పండ్లు, మంచినీటిని అందించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ రవీందర్ గౌడ్ ,విశ్రాంత ఉపాధ్యాయుడు కడార్ల గంగ నరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు యోగేష్, షేక్ ఇమ్రాన్ ,కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ ఆరిఫ్ ఖాన్ ,ఆరోగ్యశాఖ అధికారి నరసయ్య ,పలువురు పాల్గొన్నారు.