calender_icon.png 29 May, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ భద్రత మీ చేతుల్లో

28-05-2025 02:03:30 PM

- బ్లాక్ ఫిల్మ్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటాం 

- ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్ రెడ్డి


మహబూబ్ నగర్ (విజయక్రాంతి): కార్లపై బ్లాక్ ఫిలిం వినియోగిస్తే కట్న చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవాన్ రెడ్డి(Traffic Inspector Bhagavan Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కార్లపై నిషేధిత బ్లాక్ ఫిల్మ్ వాడకంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్ రెడ్డి మాట్లాడుతూ తనిఖీల్లో భాగంగా కారు డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న కార్లను గుర్తించి వాటిపై చట్టరీత్యా జరిమానాలు ఇదించడం జరిగిందన్నారు. 

మోటారు వాహనాల చట్టం ఆర్టీఏ నిబంధనల ప్రకారం కార్ల డోర్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయడం నేరమని, ఇది ప్రజల భద్రతకు హానికరమన్నారు. బ్లాక్ ఫిల్మ్ వలన వాహనాలలో కూర్చున్నవారిని వెలుపల నుండి చూడలేకపోవడం వల్ల అనేక నేరాలు జరగుతున్నాయన్నారు. అందువల్ల ప్రజలందరూ ఈ నిషేధాన్ని గౌరవించాలని, ఎవరైనా బ్లాక్ ఫిల్మ్ వాడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించడానికి ఈ తరహా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. బ్లాక్ ఫిల్మ్ ను వాహనాలపై వాడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.