calender_icon.png 29 May, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

28-05-2025 01:52:06 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి ): తెలుగు దేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 103 వ జయంతి సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప దేవాలయం చౌరస్తా వద్ద ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి కేకు కట్ చేసిన ఎన్టీఆర్ అభిమానులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు, రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజు, రంగు శ్రీనివాస్,ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.