01-07-2025 12:00:00 AM
వృద్ధురాలు సహా నలుగురు మృతి
ఇంఫాల్, జూన్ 30: కొద్ది రోజులుగా ప్రశాంతం గా ఉన్న మణిపూర్‌లో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. సోమవారం చురాచంద్‌పూర్ జిల్లాలో ఓ దుండగుడు కారుపై జరిపిన కాల్పుల్లో 72 ఏండ్ల మహిళ సహా నలుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన ప్రదేశం చురాచంద్‌పూర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కుకీ మిలిటెం ట్లు కాల్పులు జరపడంతో అక్కడున్న వృద్ధురాలు కూడా మృతి చెందింది. మృతులందరి చాలా దగ్గరి నుంచే కాల్చినట్టు ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్నాయి. మృతి చెందిన వారిని కుకీ మిలిటెంట్ నేత లెంగోహవో (35), హవోకిప్ అలియాస్ థాథ్పి (48), సీఖోంగిన్ (34), ఫాల్‌హింగ్ (72)లుగా గుర్తించారు.
ఘటనా స్థలంలో 12కంటే ఎక్కువ ఖాళీ బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ కూడా ప్రకటన విడుదల చేయలేదు. జాతుల మధ్య ఉద్రిక్తతలకు ఈ కాల్పులకు సంబంధం లేదని పోలీసు లు పేర్కొన్నారు.