calender_icon.png 22 January, 2026 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి..

22-10-2024 05:41:20 PM

పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయండి 

సంగారెడ్డి ఎస్పీ రూపేష్ 

సంగారెడ్డి (విజయక్రాంతి): పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకువచ్చేందుకు శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో పని చేయాలని సంగారెడ్డి డీఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి సమీపంలో ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ లకు పలు అంశాలపై సూచనలు చేశారు. 9 నెలల కాలం పాటు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో తప్పకుండా పాటించాలన్నారు. శాంతిభద్రత కాపాడడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావుతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.